తిరుమల బ్రహ్మోత్సవాలు: చిన్నశేష వాహనంపై శ్రీవారు, సీఎం పట్టువస్త్రాలు

రిపోర్టర్: సురేష్ స్థలం: చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు చిన్నశేష వాహనంపై మలయప్పస్వామి పాండురంగస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి స్వామివారికి 15వ సారి పట్టు వస్త్రాలు సమర్పించారు. పెద్దశేష వాహన సేవలోనూ పాల్గొన్నారు. సెప్టెంబర్ 15న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.