చిన్నారుల లైంగిక వేధింపుల నివేదికలను నేరుగా భారత్‌కే పంపనున్న గూగుల్
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
చిన్నారుల భద్రతకు పెద్దపీట వేస్తూ టెక్ దిగ్గజం గూగుల్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బాలల లైంగిక వేధింపుల కంటెంట్‌కు సంబంధించిన నివేదికలను ఇకపై నేరుగా భారత కేంద్ర హోం శాఖ పరిధిలోని సైబర్ క్రైమ్ విభాగం I4Cకి పంపేందుకు అంగీకరించింది. అమెరికాలోని ఎన్‌సిఎమ్‌ఈసి ద్వారా అందే పాత విధానానికి స్వస్తి పలుకుతూ, దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు ఈ సరికొత్త వ్యూహాత్మక మార్పును చేపట్టినట్లు గూగుల్ వెల్లడించింది.