ధర్మవరం మున్సిపల్ ఎన్నికల్ లో తీవ్ర ఉత్కంఠ: ఒక్క ఓటుతో వైసీపీ అభ్యర్థి విజయం

రిపోర్టర్: శివ స్థలం: శ్రీ సత్యసాయి జిల్లా

ధర్మవరం మున్సిపాలిటీ ఒకటో వార్డు ఎన్నికల ఫలితాల లెక్కింపులో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నట్లు అధికారులు తెలిపారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెలిమి రామకృష్ణమ్మ కేవలం ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. బీజేపీ అభ్యర్థి డిమాండ్ మేరకు నిర్వహించిన రీకౌంటింగ్ లో కూడా అదే ఫలితం రావడంతో వైసీపీ శ్రేణులు ఆనందోత్సవాల్ లో మునిగిపోయాయి.