ఓబులవారిపల్లిలో ప్రచార పర్వాన్ని హోరెత్తించిన టీడీపీ అభ్యర్థి కవిత

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఓబులవారిపల్లి

తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్ లో తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపిన జడ్పీటీసీ అభ్యర్థి కీర్తిపాటి కవిత విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సీనియర్ నాయకులు పున్నాటి వాసుదేవరెడ్డితో కలిసి ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని వారు కోరారు.