టాలీవుడ్లో మరో పెళ్లి సందడి: త్వరలో వైవాహిక జీవితంలోకి సాయి దుర్గాతేజ్

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ ప్రముఖ హీరో సాయి దుర్గాతేజ్ త్వరలోనే వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నట్లుగా సోషల్ మీడియాలో జోరుగా వార్తలు ప్రచారమవుతున్నాయని సినీ వర్గాలు పేర్కొన్నాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో వరుసగా సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కుతున్న నేపథ్యంలో, మెగా హీరో సాయి దుర్గాతేజ్ పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ పెళ్లి వార్తలపై ఇప్పటివరకు సాయి దుర్గాతేజ్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.