'వైకాపాలో నంబర్‌వన్‌ ఎవరైతే వారు సమాధానం చెప్పాలి': విజయసాయిరెడ్డి సంచలన డిమాండ్

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

వైకాపాలో గతంలో ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవుల కోసం, జగన్‌ను ఆకట్టుకునేందుకు ఎంతమంది మతం మార్చుకున్నారో వైకాపాలో నంబర్‌వన్‌ ఎవరైతే వారు సమాధానం చెప్పాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అమరావతిలో ఎక్స్‌ వేదికగా డిమాండ్ చేశారు. 2024 ఎన్నికల ముందు కాకినాడలో వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి క్రైస్తవ సభలో జగన్ సీఎం కావాలని కోరుతూ మాట్లాడిన పాత వీడియోను ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.