రాజ్‌పాల్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో గట్టి షాక్
రిపోర్టర్: వెంకట్
స్థలం: న్యూఢిల్లీ
ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్ పాల్ యాదవ్ కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో రెండు వారాల్లోగా రూ.2 కోట్లు చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆయన ప్రవర్తన డ్రామాలా ఉందని ధర్మాసనం మండిపడింది. కోర్టులో కూడా నటన ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూనే, పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించింది.