మోటోరోలా సిగ్నేచర్ 27 స్మార్ట్ఫోన్ ఫీచర్లు విడుదల తేదీ వెల్లడి
రిపోర్టర్: సతీష్
స్థలం: India
ప్రముఖ టెక్ సంస్థ మోటోరోలా తన కొత్త స్మార్ట్ఫోన్ సిగ్నేచర్ 27 విడుదలకు సంబంధించి కీలక వివరాలను వెల్లడించింది. ఎక్స్ వేదికగా విడుదల చేసిన టీజర్ ద్వారా ఈ ఫోన్ సెప్టెంబర్ 22న రానున్నట్లు స్పష్టమైంది. ఈ స్మార్ట్ఫోన్లో 200 మెగాపిక్సెల్ కెమెరా, డాల్బీ విజన్ వీడియో క్యాప్చర్ ఫీచర్, పాంటోన్ కోల్ స్మోక్, పాంటోన్ కాపులెట్ ఆలివ్ రంగుల్లో లభించనున్నట్లు కంపెనీ పేర్కొంది.