రాంపూర్‌లో అనాథ బాలికలకు అండగా నిలిచి ఆర్థికసాయం అందించిన గల్ఫ్ కార్మికులు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన అమూల్య మరియు స్పందన అనే ఇద్దరు బాలికలకు తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి నాయకులు స్థానికులతో కలిసి రూ. 93,200 ఆర్థిక సాయం అందించారు. దాతల సహకారంతో సేకరించిన ఈ మొత్తాన్ని చిన్నారుల భవిష్యత్తు కోసం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.