రోడ్డు ప్రమాదంలో గ్రామ రెవెన్యూ సహాయకుడి కుమారుడు మృతి

రిపోర్టర్: విజయ్ స్థలం: పార్వతీపురం మన్యం

పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గంట మహేష్‌ దుర్మరణం చెందాడు. తండ్రి మందుల కోసం వెళ్లి వస్తున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఆయన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. నాలుగు నెలల క్రితమే తల్లి మృతి చెందగా, ఇప్పుడు మహేష్‌ కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. భార్య, ఇద్దరు చిన్నారులు రోదిస్తున్న తీరు కలచివేసింది.