తెలంగాణ శాసనమండలిలో ఇద్దరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌ రెడ్డిలను ప్రస్తుత సమావేశాల కాలం మొత్తం మండలి నుంచి సస్పెండ్ చేశారు. స్పీకర్‌ను అవమానించడం క్షమరాని నేరమని మంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. ఈ ఘటనపై కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సభలో తీర్మానం ప్రవేశపెట్టగా, దానికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు లభించింది.