జహీరాబాద్‌లో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరేస్ట్
రిపోర్టర్: సతీష్
స్థలం: సంగారెడ్డి
మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల డిమాండ్‌తో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు తట్టు నారాయణ, మాజీ సర్పంచ్ చిన్నా రెడ్డిలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. బిల్లులు ఇవ్వకుండా అరెస్టులతో కాలయాపన చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తట్టు నారాయణ మండిపడ్డారు.