అమెరికాలో హెచ్-1బి ఉద్యోగులకు షాక్: వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

అమెరికాలో హెచ్-1బి వీసాపై ఉద్యోగం చేస్తున్న భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చిందని వలస నిపుణులు తెలిపారు. గతంలో వర్క్ పర్మిట్ రెన్యువల్ ఆలస్యమైనప్పటికీ 540 రోజుల పాటు ఉద్యోగం కొనసాగించే సదుపాయాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని వారు పేర్కొన్నారు. దీంతో కొత్త పర్మిట్ చేతికి అందేలోపు పాత గడువు ముగిస్తే తాత్కాలికంగా పని ఆపాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల వేలాది భారతీయ కుటుంబాల ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.