ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: నారాయణపురం

సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో తెలంగాణ ఉద్యమ నేత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ గజం అనిత సత్యనారాయణ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాపూజీ సేవలను స్మరించుకున్నారు.