క్రియాశీలక కార్యకర్తలకు గుర్తింపు కార్డులు బొత్స సత్యనారాయణ ప్రకటన
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయనగరం
క్రియాశీలక కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపుగా గుర్తింపు కార్డులను అందజేయనున్నట్లు వైఎస్సార్సీపీ శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, వారికి తగిన గౌరవం దక్కేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.