అక్రమ లేఅవుట్లపై అధికారుల కొరడా: రిజిస్ట్రేషన్ల రద్దుకు డీఎల్పీవో శ్రీనివాస్ హెచ్చరిక

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హుజూరాబాద్

గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా భూముల క్రయవిక్రయాలు జరిపితే రిజిస్ట్రేషన్ రద్దుకు సిఫార్సు చేస్తామని హుజూరాబాద్ డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్ హెచ్చరించారు. చెల్పూర్ లో అక్రమ లేఅవుట్లపై కలెక్టర్ కు ఫిర్యాదు అందడంతో అధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కితే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.