బాలింతలకు ప్రాణాంతక సెప్సిస్ జ్వరంపై గైనకాలజిస్ట్ దివిషా రెడ్డి హెచ్చరిక

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

గర్భధారణ సమయంలో వచ్చే ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతక ప్యూర్పరల్ సెప్సిస్గా మారుతుందని గ్లెనెగల్స్ హాస్పిటల్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ వై. దివిషా రెడ్డి హైదరాబాద్లో హెచ్చరించారు. జ్వరం, తీవ్రమైన వణుకు, ఆయాసం, పొత్తికడుపు నొప్పి వంటి లక్షణాలను బాలింతలు ఎట్టిపరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోవద్దని ఆమె స్పష్టం చేశారు. ప్రారంభ దశలోనే సరైన వైద్య చికిత్స అందించడం ద్వారా తల్లుల ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.