రామేశ్వరం నుంచి అయోధ్యకు సైకిల్ యాత్ర: రెండున్నర వేల కిలోమీటర్లు తొక్కిన యువకుడు

రిపోర్టర్: శివ స్థలం: Noida

తమిళనాడులోని రామేశ్వరం నుంచి ఉత్తరప్రదేశ్లోని అయోధ్య వరకు ముప్ పై ఏళ్ల సార్థక్ చౌహాన్ రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరాన్ని పదహారు రోజుల్లో సైకిల్ పై విజయవంతంగా పూర్తి చేశారు. శ్రీరాముడి ప్రయాణ మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఏడు రాష్ట్రాలను దాటుకుంటూ ఈ యాత్ర సాగించినట్లు ఆయన తెలిపారు. దేశంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉండటం వల్లే తాను ఎలాంటి భయం లేకుండా ఒంటరిగా ఈ సుదీర్ఘ ప్రయాణం చేయగలిగానని సార్థక్ చౌహాన్ వెల్లడించారు.