సీఎం నివాసం ముట్టడి పిలుపుతో బెల్లంపల్లిలో ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బెల్లంపల్లిలో ఏడుగురు ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, పింఛన్లు, ఇళ్లు, ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.