ఆసియా క్రీడల్లో పతకాల పంట పండించిన భారత అథ్లెట్లు

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచి పతకాలు సాధించారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. మిక్వెడ్ రిలేలో కాంస్యం, మహిళల విభాగంలో స్వర్ణం, పురుషుల రిలేలో మరో కాంస్యం దేశం గర్వించదగ్గ రీతిలో దక్కించుకున్నారని ఆయన పేర్కొన్నారు. అనిమేష్ కుజుర్, కిరణ్, ధర్మవీర్ చౌదరి తదితర అథ్లెట్లు దేశ కీర్తిని విశ్వవేదికపై చాటారని అభినందించారు. ఈ చారిత్రాత్మక విజయం ద్వారా దేశ యువతకు క్రీడలపై ఆసక్తి మరింత పెరుగుతుందని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.