పది కోట్లకు చేరువలో సర్వేపల్లి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ: సోమిరెడ్డి
రిపోర్టర్: Venkey ...Nlr
స్థలం: నెల్లూరు అర్బన్
నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో డెబ్బై ఏడు మంది బాధితులకు నూతన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘనంగా పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు నియోజకవర్గంలో వెయ్యి మందికి పైగా లబ్ధిదారులకు తొమ్మిది కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. అనారోగ్య బాధితులకు ఈ సాయం సంజీవనిలా నిలుస్తోందని పేర్కొన్నారు.