మిషన్ శక్తిలో భాగంగా ఒక రోజు జిల్లా కలెక్టర్గా పదవి చేపట్టిన విద్యార్థిని

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Farrukhabad

మిషన్ శక్తి కార్యక్రమంలో భాగంగా ఫరూఖాబాద్ జిల్లాకు చెందిన ఆరవ తరగతి విద్యార్థిని పాయల్ దీక్షిత్ ఒక రోజు కలెక్టర్గా బాధ్యతలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఫరూఖాబాద్ కలెక్టర్ అంకుర్ లాథర్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు ఐఏఎన్ఎస్ వెల్లడించింది. ఈ సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విచారణలో ఆమె పాల్గొని ఆరుగురి ఫిర్యాదులను స్వయంగా ఆలకించి, తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.