రాష్ట్రంలో పెట్టుబడుల వరద పారుతోందని నారా లోకేష్ వెల్లడి
రిపోర్టర్: సునీల్
స్థలం: శ్రీకాకుళం
దేశంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడులలో పాతిక శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వచ్చాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇండియా టుడే కాన్క్లేవ్ వేదికగా ఆయన మాట్లాడుతూ, తాము స్పష్టమైన క్లస్టర్ ఆధారిత విధానంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. ఈ సరైన పద్ధతే రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ అగ్రస్థానంలో నిలబెడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పారదర్శక విధానాల వలనే పారిశ్రామికవేత్తలు రాష్ట్రంవైపు ఆకర్షితులవుతున్నారని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.