బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ కు బెదిరింపు కాల్: ఐదు కోట్ల వసూలుకు యత్నం

రిపోర్టర్: రాము స్థలం: ముంబై

ప్రముఖ బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో దుండగులు ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ బెదిరింపు కాల్ చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై నటుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా క్రైమ్ బ్రాంచ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆడియో రికార్డింగ్ లోని గొంతు హ్యారీ బాక్సర్ శాంపిల్స్ తో మ్యాచ్ కాకపోవడంతో ఇది నకిలీ కాల్ అయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.