ఎన్నికల విధుల్ లో తీవ్ర ఇబ్బందులు: ఉపాధ్యాయుడి అస్వస్థతతో పాటు బురదలో అవస్థలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: విజయనగరం

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు మండలాల్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల వద్ద సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అధికారులు తెలిపారు. మురసు తుపాను కారణంగా కురిసిన వర్షాలకు బురదమయమైన ప్రాంగణాల్ లో బస్సులు రాకపోవడంతో సిబ్బంది నడిచి వెళ్లాల్సి వచ్చింది. మెంటాడ మండలంలో విధులకు వచ్చిన ఉపాధ్యాయుడు ఎన్ అజయ్ కుమార్ అస్వస్థతకు గురై కింద పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. చంటిబిడ్డతో విధులకు హాజరైన మహిళా ఉద్యోగినిని అధికారులు రిజర్వులో ఉంచారు.