డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం, యువకుడికి తీవ్ర గాయాలు
రిపోర్టర్: హరి
స్థలం: మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన నరేన్ అనే యువకుడు రైలు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో అతడి రెండు కాళ్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మహబూబాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు.