నెల్లూరులో శాంతిభద్రతల వైఫల్యం: నగరంలో పెరుగుతున్న హత్యలు, రౌడీయిజంపై తీవ్ర కలకలం
రిపోర్టర్: హరి
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా గాడితప్పుతున్నాయని, రౌడీషీటర్ల ఆగడాలు పెరిగిపోతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో రోజుల వ్యవధిలో వరుస హత్యలు జరుగుతున్నా పోలీసులు నిద్రావస్థలో ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. రాత్రి వేళల్లో గస్తీ కొరవడటంతో గంజాయి మత్తులో నేరాలు ఎక్కువవుతున్నాయని, ప్రజలు భయాందోళనల మధ్య బిక్కుబిక్కుమంటూ జీవించాల్సిన దుస్థితి నెలకొందని స్థానికులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.