కూటమి విజయంపై వైఎస్ జగన్ సెటైర్లు: చంద్రబాబుకు అభినందనలు తెలిపిన వైనం

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్ లో కూటమి ఘన విజయం సాధించడంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారని వైఎస్ఆర్సీపీ వర్గాలు వెల్లడించాయి. సీఎం చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలుపుతూనే ఎన్నికల నిర్వహణ తీరుపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ, ఎన్నికల సంఘం సహకారంతోనే అధికార పార్టీ గెలుపందిందని ఆయన విమర్శించారు. నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు అన్ని దశల్లోనూ అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించారు.