స్మార్ట్‌ఫోన్ భద్రతకు నాలుగు కీలక మార్గాలు: సైబర్ నేరాలకు చెక్ పెట్టండి
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ భద్రత ప్రతి ఒక్కరికీ అత్యంత ప్రాధాన్యమని సైబర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చిన్న నిర్లక్ష్యం వల్ల వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి స్ట్రాంగ్ పాస్‌కోడ్ సెట్ చేసుకోవడం, స్క్రీన్ లాక్ టైమ్‌ను తగ్గించడం, నోటిఫికేషన్లో ఓటీపీలను హైడ్ చేయడం మరియు సాఫ్ట్వేర్ అప్డేట్లను క్రమం తప్పకుండా చేయడం వంటి నాలుగు ముఖ్యమైన భద్రతా టిప్స్‌ను పాటించాలని నిపుణులు వెల్లడించారు.