తెలంగాణలో ఎన్ఆర్ఐ కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి

రిపోర్టర్: రాము స్థలం: Hyderabad

ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న ప్రవాస తెలంగాణవాసుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా తెలంగాణ ఎన్ఆర్ఐ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి కోరారు. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్‌తో కలిసి అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న ఆస్తి వివాదాలు, భూ సమస్యలు, అత్యవసర పరిస్థితులకు ఈ కమిషన్ ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ వినతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు.