వంద కోట్ల క్లబ్ దిశగా టాలీవుడ్ నటుడు సుహాస్ మండాడి మూవీ
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ నటుడు సుహాస్, తమిళ నటుడు సూరి ప్రధాన పాత్రల్లో నటించిన మండాడి చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయంతో దూసుకుపోతోంది. సెల్ఫీ ఫేం మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం గ్లోబల్ వైడ్గా కోట్ల రూపాయల గ్రాస్ సాధిస్తూ సూరి కెరీర్లో సరికొత్త రికార్డు సృష్టిస్తోందని సినీ వర్గాలు వెల్లడించాయి. తెలుగు వెర్షన్ కూడా మంచి విజయం అందుకోవడంతో రాబోయే రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి.