బీఆర్ఎస్ నేత కేటీఆర్ పీఆర్ఓ మహేష్ మాణిక్యం అరెస్ట్

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్ఓ మహేష్ మాణిక్యాన్ని బొల్లారం పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 8న బొల్లారం చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో ఆయనపై బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసుకు సంబంధించి విచారణ ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో గురువారం రాత్రి బొల్లారం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.