పీఎం విద్యాలక్ష్మి పథకంతో విద్యార్థులకు భరోసా కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: New Delhi
పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆర్థిక ఇబ్బందులు విద్యకు అడ్డంకి కైకూడదనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక పథకాన్ని రూపొందించినట్లు పేర్కొంది. అర్హులైన ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చింది. ఈ పథకం ద్వారా విద్యార్థులు ఎలాంటి ఆర్థిక ఆందోళనలు లేకుండా తమ కలలను సాకారం చేసుకునేలా ప్రభుత్వం తగిన చేయూతనందిస్తోందని స్పష్టం చేసింది.