ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఏఐ స్కిల్లింగ్ తప్పనిసరి చేయాలి
రిపోర్టర్: కిరణ్
స్థలం: అమరావతి
ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ 59వ గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పాలని, విద్యార్థులకు ఏఐ స్కిల్లింగ్ తప్పనిసరి చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. అలాగే 10 ఏపీఆర్ విద్యాసంస్థలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లుగా అభివృద్ధి చేయడంతో పాటు నిమ్మకూరులో ఐఐటీ-జేఈఈ, నీట్ అకాడమీ ఏర్పాటుకు బోర్డు ఆమోదం తెలిపింది.