భీమిలి కేజీబీవీ హాస్టల్‌లో బాలికల జుట్టు కత్తిరింపు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: భీమిలి, విశాఖపట్నం

విశాఖపట్నం జిల్లా భీమిలిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ హాస్టల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పది మంది విద్యార్థినుల జుట్టును కత్తిరించారు. ఈ విషయాన్ని అధికారులు బయటకు పొక్కకుండా తీవ్రంగా గోప్యం పాటిస్తున్నారు. దీనిపై ప్రస్తుతం రహస్య విచారణ కొనసాగుతోంది.