షాకింగ్ ఘటన: భర్త వేధింపులతో నౌకాదళ ఉద్యోగి భార్య, పిల్లల ఆత్మహత్యాయత్నం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఫరీదాబాద్
హరియాణాలోని ఫరీదాబాద్‌లో నౌకాదళ ఉద్యోగి సునీల్ వేధింపులు భరించలేక అతని భార్య మాల మరియు ముగ్గురు పిల్లలు బలవన్మరణానికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. సూర్య విహార్ ఫేజ్ 2 ప్రాంతంలో జరిగిన ఈ దారుణ ఘటనలో ఇంట్లో ఎలుకల మందు తిన్న నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, వారిని మెరుగైన వైద్యం కోసం దిల్లీ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. భర్త శారీరక హింస, అనుమానపు మాటలతో విసిగిపోయి ఈ తీవ్ర అడుగు వేసినట్లు పెద్ద కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది.