స్టార్‌బక్స్ డ్రింక్‌లో చనిపోయిన ఈగ కంటెంట్ క్రియేటర్ ఆందోళన

రిపోర్టర్: గోపి స్థలం: దిల్లీ

దిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ శిఖ కొనుగోలు చేసిన స్టార్‌బక్స్ పానీయంలో చనిపోయిన ఈగ రావడంతో తీవ్ర దుమారం రేగింది. సుమారు ఐదు వందల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ డ్రింక్‌లోని స్ట్రాబెర్రీ ముక్కపై ఈగ అతుక్కుని ఉండటాన్ని ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంత డబ్బు చెల్లించినా పరిశుభ్రత లేదా అంటూ ఆమె ప్రశ్నించగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన స్టార్‌బక్స్ ఇండియా సంస్థ క్షమాపణలు కోరుతూ బాధితురాలిని సంప్రదించే ప్రయత్నం చేసింది.