సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులపై సైబర్ క్రైమ్ను ఆశ్రయించిన విజయ్ దేవరకొండ
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
సోషల్ మీడియాలో తమపై వస్తున్న నకిలీ, అసత్య ప్రచారాలపై టాలీవుడ్ ప్రముఖ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల బృందం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసినట్లు వారి ప్రతినిధులు తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు.