అనంతపురం రైతు సాహసం: చామంతి సాగుతో లక్షల రూపాయల లాభాలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా నార్పల మండలం వెంకటాం గ్రామానికి చెందిన రైతు రఫీ సంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి లాభసాటి ప్రత్యామ్నాయ సాగు వైపు అడుగులు వేశారు. మార్కెట్ డిమాండ్ అంచనా వేసి ఆరు ఎకరాల్లో చామంతి సాగు చేస్తూ అద్భుతమైన లాభాలు ఆర్జిస్తున్నట్లు ఆయన తెలిపారు. పండగలను టార్గెట్ చేసుకుని విడతల వారీగా పంటను సాగు చేయడం ద్వారా భారీ ఆదాయం లభిస్తోందని, ఇతర రైతులకు తాను ఆదర్శంగా నిలుస్తున్నానని రఫీ వివరించారు.