పెరుగుతున్న ధరలతో అల్లాడిపోతున్న సామాన్యుడి బతుకు చిత్రం
రిపోర్టర్: Bobbili GANESH
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో నిత్యవసర వస్తువులు, కూరగాయల ధరలు అమాంతంగా ఆకాశాన్నంటడంతో సామాన్యులు తీవ్రంగా అల్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మార్కెట్‌ను పరిశీలించిన ఆయన, నిత్యావసరాలు మరియు కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు జీవనం సాగించడం కష్టంగా మారిందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సబ్సిడీపై సరుకులు అందించాలని డిమాండ్ చేశారు.