డ్రగ్స్ నిరోధక విజన్ డాక్యుమెంట్‌పై మంత్రి అనిత సమీక్ష

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అనకాపల్లి

మంగళగిరి EAGLE కార్యాలయంలో 2026-2029 డ్రగ్స్ నిరోధక విజన్ డాక్యుమెంట్‌పై హోంమంత్రి అనిత వంగలపూడి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, EAGLE కార్యాచరణపై కీలకంగా చర్చించారు. ఈ సమావేశంలో EAGLE చీఫ్ ఐజీ రవి కృష్ణ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.