పెద్దగెడ్డ జలాశయంలో ఆన్లైన్ బెట్టింగ్ బాధితుడు గల్లంతు
రిపోర్టర్: రాజేష్
స్థలం: పాచిపెంట
ఆన్లైన్ బెట్టింగ్ అప్పుల బాధతో మనస్తాపం చెంది పెద్దగెడ్డ జలాశయంలో వ్యక్తి గల్లంతైనట్లు ఎస్సై ఎల్.అర్జున్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కొత్తవలస గ్రామానికి చెందిన చిత్త వీర్రాజు బతకడం ఇష్టం లేదంటూ లేఖ రాసి జలాశయం వద్దకు వెళ్లారు. గట్టుపై బైక్, లేఖ లభించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి పెద్దకర్మ రోజే ఈ దుర్ఘటన జరగడంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఎస్సై వెల్లడించారు.