జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అచ్యుతాపురం మండల ఉపాధ్యాయుల ఎంపిక

రిపోర్టర్: I am Farmer 🍅🌱 స్థలం: అచ్యుతాపురం

అచ్యుతాపురం మండలానికి చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. కడపాలెం ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ ఇ.అరుణకుమారి, పెదపాడు జెడ్పీ హెచ్ఎం కె.కృష్ణమోహన్, కొండకర్ల జెడ్పీ హెచ్ఎం కె.శ్రీనివాసరావు ఈ ఘనత సాధించారు.

విద్యార్థుల అభ్యున్నతికి అంకితభావంతో చేసిన కృషికి ఈ గుర్తింపు దక్కింది. నాణ్యమైన విద్యను అందిస్తూ భవిష్యత్తుకు బాటలు వేస్తున్న వీరి ఎంపిక పట్ల ఎంఈఓ దేవరాయల్, తోటి ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.