పాడేరులో గ్రంథాలయాల ఏర్పాటుకై అధికారులకు వినతిపత్రం సమర్పణ

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: పాడేరు

పాడేరులో ఉమ్మడి జిల్లా గ్రంథాలయ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డిని జనసేన మరియు బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. పెద్దకుంతర్ల, వనబంగి, గంపరాయి పంచాయతీలలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత కోసం ప్రత్యేకంగా మూడు గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని వారు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన చైర్మన్, ఆయా ప్రాంతాలలో అనుకూలమైన భవనాలు అందుబాటులో ఉంటే వెంటనే గ్రంథాలయాలు మంజూరు చేస్తామని సానుకూలంగా హామీ ఇస్తూ భరోసా కల్పించారు.