వారణాసి సినిమా: పృథ్వీరాజ్ బర్త్డేపై రాజమౌళి స్పెషల్ ట్వీట్ వైరల్

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి చిత్రంలో నటిస్తున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంలో కుంభ పాత్రలో పృథ్వీరాజ్ నటిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్రంగా ట్రెండ్ అవుతూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.