భారతదేశంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల నిర్వహణ
రిపోర్టర్: రాజేష్
స్థలం: India
భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1962లో తన పుట్టినరోజును కేవలం వ్యక్తిగత వేడుకగా కాకుండా, దేశంలోని ఉపాధ్యాయులందరి సేవలను గౌరవించేలా నిర్వహించాలని రాధాకృష్ణన్ కోరారు. అప్పటి నుండి ఆయన నిరాడంబరతకు, ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆయనకున్న గౌరవానికి చిహ్నంగా ఈ రోజును అధికారికంగా ఉపాధ్యాయ దినోత్సవంగా పాటిస్తున్నాం.