రాప్తాడులో దారుణం: పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి

రిపోర్టర్: విజయ్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ ఉన్మాది రంపంతో అటాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ అమానుష ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, నిందితుడిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారని అధికారులు వెల్లడించారు.