పలుగు తండాలో ఐక్యత ఫౌండేషన్ స్వచ్ఛ జలధార కార్యక్రమం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వెల్దండ
వెల్దండ మండలం పలుగు తండా గ్రామంలో ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు అందించే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ జలధార కార్యక్రమం నిర్వహించారు. చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో జర్మన్ సాంకేతికతతో కూడిన ప్రత్యేక యంత్రాలతో త్రాగునీటి నిల్వ ట్యాంకులను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, డిప్యూటీ సర్పంచ్ అనితతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.