మహారాష్ట్ర లా ప్రవేశాలు: మూడేళ్ల ఎల్ఎంబీ కోర్సులో ముగింపు దశకు కౌన్సిలింగ్ ప్రక్రియ
రిపోర్టర్: హరి
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలో మూడేళ్ల ఎల్ఎంబీ కోర్సు ప్రవేశాల ప్రక్రియ తుది దశకు చేరినట్లు సీఈటీ సెల్ అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో ఇప్పటివరకు పద్దెనిమిది వేల మందికి పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇన్స్టిట్యూషనల్ రౌండ్ ద్వారా మిగిలిన సీట్లను భర్తీ చేస్తున్నామని, అడ్మిషన్ల ప్రక్రియకు ఈరోజుతో గడువు ముగియనుందని స్పష్టం చేశారు.