బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్: కంటెస్టెంట్లకు నాగార్జున క్లాస్
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
బిగ్ బాస్ హౌస్ లో శనివారం వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని నిర్వాహకులు తెలిపారు. వంశీ కొత్త కెప్టెన్‌గా ఎంపిక కాగా, నామినేషన్లు, టాస్క్‌లలో జరిగిన గొడవలు, తప్పులపై నాగార్జున నిలదీశారు. దేబ్జానీ కాఫీ ఇష్యూ, వర్షిణి ప్రవర్తన, నీతూ మాస్టర్ తీరుపై ప్రత్యేకంగా మాట్లాడి వీడియోలు చూపించి తప్పులను ఎత్తిచూపారు. నరేష్ చేసిన సంచాలక్ తప్పు వల్ల ఫ్యామిలీ వీక్ చాన్స్ కోల్పోయారని నాగ్ స్పష్టం చేశారు.